calender_icon.png 24 October, 2025 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల పనితీరుపై అవగాహన

24-10-2025 05:29:09 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల పనితీరుపై శుక్రవారం విద్యార్థులకు సీఐ శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ... అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పోలీసు శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎఫ్ఐఆర్ నమోదు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, ఫింగర్ ప్రింట్ విధానం, 100 డయల్ సేవలపై వివరించారు.