calender_icon.png 21 December, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్టడీ, హింస ఆరోపణలపై సీఐ సస్పెన్షన్

21-12-2025 01:21:58 AM

చిలుకూరు ఎస్‌ఐని జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్

కోదాడ, డిసెంబర్ 20: సూర్యాపేట జిల్లాలోని కోదాడలో జరిగిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అవకతవకల కేసులో నిందితుడిగా ఉన్న కర్ల రాజేష్ మరణం జిల్లా పోలీసు వ్యవస్థపై పెద్ద వివాదానికి దారితీసింది.ఈ కేసులో రిమాండ్‌కు ముందే రాజేష్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన పోలీసులు, అధిక బలప్రయోగం చేశారని బంధువులు, ప్రజా సంఘా లు ఆరోపిస్తున్నాయి. ఈ సంఘటన నేపధ్యంలో ఉన్నతాధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కోదా డ రూరల్ సీఐ ప్రతాప్ లింగాన్ని సస్పెండ్ చేస్తూ, చిలుకూరు ఎస్‌ఐ సురేష్ రెడ్డిని జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు వీరిపై అంతర్గత చర్యలు కొనసాగనున్నాయి.

రాజేష్ హుజూర్‌నగర్ జైలుకు తరలించిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మృతి చెందాడు. అయితే ఇది సాధారణ ఆరోగ్య సమస్య వల్ల కాదని, ముందస్తు విచారణలో జరిగిన పోలీసు హింస కారణమని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రిమాండ్‌కు ముందు పోలీసులే ప్రాణాలు తీశారు అని ప్రజా సంఘాలు, హక్కుల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఈ ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) రాజేష్ మృతిపై కేసు నమోదు చేసింది. పూర్తి దర్యాప్తు జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

న్యాయం చేయాలని ఆందోళనలు 

రాజేష్ మృతిపై ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఉధృత ఆందోళనలు కొన సాగు తున్నాయి. ఈ విషయంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాది గ లాకప్ డెత్‌కు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ సైతం ఈ కేసులో బాధితు లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్న డిమాండ్‌తో పాటు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని ప్రజాసంఘాలు కోరుతున్నాయి.