calender_icon.png 21 December, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంను కలిసిన టీఆర్టీఎఫ్ ప్రతినిధులు

21-12-2025 01:22:54 AM

హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాం తి): టీఆర్టీఎఫ్ 80 వసంతాల అభ్యుదయోత్స వం, విద్యాసదస్సును ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సందర్భంగా సంఘం అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేత చేయడమే ప్రధాన లక్ష్యంగా సదస్సును నిర్వహిస్తున్నట్లు సీఎంకు వారు వివరించారు. విద్యా సదస్సులో చేసే తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని, వాటిని పరిగణలోకి తీసు కోవాలని సీఎంను వారు కోరినట్లు తెలిపారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారని ఒక ప్రకటనలో వారు తెలిపారు.