21-12-2025 12:45:46 AM
వారి పాలన వైఫల్యంతోనే భారత్‌లోకి చొరబాట్లు
చొరబాటుదారులు భూములు ఆక్రమించారు..
అడవులను ధ్వంసం చేశారు.. అస్సాం ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీశారు..
ఆ తప్పులను బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతున్నది:ప్రధాని మోదీ
గౌహతిలో రూ.15,600 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
గౌహతి, డిసెంబర్ 20: ‘కాంగ్రెస్ హయాంలో ఈశాన్య ప్రాంతం నిర్లక్ష్యానికి గురైంది. ఈశాన్య రాష్ట్రాలపై కాంగ్రెస్ శీతకన్ను వేసింది. ఆయా రాష్ట్రాల అభివృద్ధి గు రించి ఏమాత్రం పట్టించుకోలేదు. నాటి పాలకులు చేసిన తప్పులను బీజేపీ ప్రభు త్వం సరిదిద్దుతున్నది.అభివృద్ధికి బాటలు వేస్తున్నది. ప్రజలకు మౌలిక వసతులు కల్పిస్తున్నది’ ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నా రు. అస్సాం పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని రాష్ట్ర రాజధాని గౌహతిలో సుమా రు రూ.15,600 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ.4,000 కోట్ల వ్యయంతో 1.4 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన కొత్త టె ర్మినల్స్‌ను ఆయన ప్రారంభించారు.
విమానాశ్రయం వెలుపల గోపీనాథ్ బోర్డోలోయ్ 80 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత నగరంలోని పలు అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. ఈ ప్రాంత భద్రతను, అ స్సాం అస్తిత్వాన్ని కాపాడడేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అస్సాంలోకి అక్రమ చొరబాటుదారులను కాంగ్రెస్ ప్రోత్సహించిందని ఆరోపించారు. చొరబాటుదారులు అడవులను, భూములను ఆక్రమిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని విమర్శించారు.
ఓటరు జాబితాలో చొరబాటుదారులు లేకుండా ఎన్నికల సం ఘం చేపట్టిన సంస్కరణలను కొందరు దేశద్రోహులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అస్సాం మున్ముం దు భారత అభివృద్ధికి ముఖద్వారంగా మారబోతుందని ఆకాంక్షించారు. డబుల్ ఇంజి న్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని అస్సాంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తోందన్నారు. బహిరంగ సభ తర్వాత ప్రధా ని గౌహతిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ కార్యకర్తలతో సమావేశమై రాను న్న ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
వర్చువల్‌గా తాహెర్‌పూర్
ర్యాలీ ప్రారంభం
అస్సాం పర్యటన తర్వాత ప్రధాని పశ్చి మ బెంగాల్‌లోని తాహెర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ, ప్రతికూలమైన వాతావరణం కారణంగా ఆయన ప్రయాణం రద్దయింది. దీంతో ప్రధాని వర్చువల్‌గా తాహెర్‌పూర్ ర్యాలీలో భాగస్వామి అయ్యారు. ముందుగా బీజేపీ శ్రేణుల ర్యాలీని ప్రారంభించారు. బెం గాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం చొర బాటుదారులను ప్రోత్సహిస్తోందని ప్రధాని ఆరోపించా రు.
అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. బెంగాల్ ప్రభు త్వం చొరబాటుదా రులను కాపాడుకునే క్రమంలోనే రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్ర త్యేక సమగ్ర సవరణ (సర్)ను వ్యతిరేకిస్తున్నదని దుయ్యబట్టారు. సీఎం మమత పాలనలో బెంగాల్‌లో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని మండిపడ్డారు. అలాంటి ‘మహా జంగి ల్‌రాజ్’కు తగిన బుద్ధి చెప్పాలంటే రాష్ట్రప్రజలు డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి పనులను మమత ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
నేడు ‘పరీక్షా పే చర్చ’
రెండో రోజు అస్సాం పర్యటనలో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ బ్రహ్మపుత్ర నదిపై క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తూ పాఠశాల విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చ’ నిర్వహించనున్నారు. సుమారు 25 మంది ప్ర తిభావంతులైన విద్యార్థులతో ఆయన స్వయంగా మా ట్లాడనున్నారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా జ యించాలనే అంశంపై విద్యార్థులకు సూచనలివ్వనున్నారు. ఆ రాష్ట్రంలో నదీ పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రధాని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం నాటి అస్సాం ఉద్యమంలో అసువులు బాసిన 860 మంది అమరవీరుల స్మారకార్థం నిర్మించిన ‘స్వహిద్ స్మారక క్షేత్రాన్ని’ ప్రధాని సందర్శిస్తారు. తర్వాత నమ్రూపుక్‌కు చేరుకుని సుమారు 12,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అమ్మోనియా- యూరియా ఎరువుల ప్రాజెక్టుకు భూమిపూజ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.