calender_icon.png 21 December, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్సాంలో ఘోర రైలు ప్రమాదం

21-12-2025 12:40:12 AM

గజరాజుల గుంపును ఢీకొట్టిన రాజధాని ఎక్స్‌ప్రెస్

ఎనిమిది ఏనుగులు మృతి.. మరో గున్న ఏనుగుకు గాయాలు

పట్టాలు తప్పిన రైలు ఇంజిన్, ఐదు కోచ్‌లు

ప్రయాణికులు సురక్షితం

రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

గౌహతి, డిసెంబర్ 20: అస్సాంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. హోజా య్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున సైరంగ్- రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది ఏనుగులు అక్కడికక్కడే మృ తిచెందగా, మరో గున్న ఏనుగుకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు రైలు ఇంజన్ తో పాటు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. శనివారం తెల్లవారుజామున 2:17 గంటల ప్రాంతంలో మిజోరాంలోని సైరంగ్ నుంచి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఈ ప్ర మాదానికి గురైంది. గువాహటికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. ప్ర మాద వార్త తెలియగానే సహాయక బృందా లు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రైలు పట్టాలపై ఏనుగుల కళేబరాలు..

ఈ ప్రమాదం కారణంగా రైలు పట్టాలపై ఏనుగుల కళేబరాలు చెల్లాచెదురుగా పడటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఎగువ అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లే రైలు సర్వీసులపై ప్రభావం పడింది. ప్రమాదానికి గురైన రైలులోని ప్రయాణికులను అదే రైలులోని ఖాళీ బెర్తుల్లో సర్దుబాటు చేశారు. గువాహటి చేరుకున్న తర్వాత అదనపు కోచ్‌లను జతచేసి, రైలును తిరిగి ఢిల్లీకి పంపిస్తామని అధికారులు తెలిపారు.

కాగా, ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఏనుగుల కారిడార్ కాదని అటవీ అధికారులు తెలిపారు. రైలు పట్టాలపై ఏనుగుల గుంపును గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ, ఏనుగులు వేగంగా రైలును ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగిందని రైల్వే అధి కారులు తెలిపారు. కాగా, ప్రభావిత  కోచ్‌లలోని ప్రయాణికులను తాత్కాలికంగా రైలు లోని ఇతర కోచ్‌లలోని ఖాళీ బెర్త్‌లలో ఉంచారు. రైలు గౌహతి చేరుకున్న తర్వాత, ప్రయాణికులకు వసతి కల్పించడానికి అదనపు కోచ్‌లను జత చేస్తామని, తర్వాత వారిని గమ్యస్థానాలకు చేరుస్తామని రైల్వే అధికారులు తెలిపారు.

ఐదేళ్లలో రైళ్లు ఢీకొని 79 ఏనుగులు మృతి

గత ఐదు సంవత్సరాల్లో  దేశవ్యాప్తంగా పలు రైలు ప్రమాదాల్లో 79 ఏనుగులు మృతిచెందాయని పర్యావరణ మంత్రిత్వ శాఖ గత ఆగస్టులో పార్లమెంట్‌కు తెలిపింది.  2020 నుంచి 2024- వరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనల నివేదికల ఆధారంగా ఈ సంఖ్యను లెక్కించినట్లు పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.  ఈ ఏడాది జూలై 18న పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఖరగ్‌పూర్ సెక్షన్లో వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని తల్లి, ఆమె పిల్లతో సహా మూడు ఏనుగులు మృతి చెందాయని సింగ్ ధృవీకరించారు.