calender_icon.png 21 December, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేషన్ ఘనపూర్‌లో ఫ్లెక్సీ వివాదం

21-12-2025 12:49:19 AM

  1. ఎమ్మెల్యే కడియం మా ఎమ్మెల్యేనే..
  2. కడియంతోపాటు మాజీ ఎమ్మెల్యే తాటికొండ ఫొటోలతో స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ నాయకులు
  3. అనుమతి లేదంటూ తొలగించేందుకు అధికారుల ప్రయత్నం
  4. అడ్డుకున్న బీఆర్‌ఎస్ నాయకులు.. అరెస్టు

మహబూబాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు ఇటీవల స్పీకర్‌కు లేఖ సమ ర్పించినట్టు ప్రచారం సాగుతున్న నేపథ్యం లో శనివారం స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. ఉప్పు, నిప్పుగా మారిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఫోటోలతో కూ డా స్వాగత ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

స్థానిక తిరుమలనాథ స్వామి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా పట్టణంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసి, సిబ్బంది చేత ఫ్లెక్సీని తొలగించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు అడ్డుకొని, మున్సిపల్ అధికా రులతో వాగ్వాదానికి దిగారు.

పట్టణంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలన్నిటికీ అనుమ తులు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. అధికారులతో వాగ్వాదానికి దిగి, అడ్డుపడ్డ బీఆ ర్‌ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరోత్సవానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలోనూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫొటో ఉండటం గమనార్హం.

కడియం తీరు సిగ్గుచేటు: బీఆర్‌ఎస్

తమ కష్టార్జితంతో విజయం సాధించి, అభివృద్ధి సాకుతో కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇప్పుడు మళ్లీ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు కడియం శ్రీహరి ప్రకటించడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. కడియం శ్రీహరి తన పదవికి బేషర తుగా రాజీ నామా చేసి, దమ్ముంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. కడియం శ్రీహరి దిగజారుడుగా వ్యవహరించడం సరైనది కాదన్నారు.

పట్టణంలో అనేక రాజకీయ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా అభ్యంతరం చెప్పని మున్సిపల్ అధికారులు.. తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడం సరైంది కాదని మండిపడ్డారు. తమ పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఖండిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ పట్టణంలో ఉద్రిక్తతకు దారితీసింది.