calender_icon.png 21 December, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మానేరుపై మరో హై లెవెల్ బ్రిడ్జి

21-12-2025 12:42:58 AM

  1. నిర్మించేందుకు ప్రభుత్వం అంగీకారం
  2. ఆర్‌అండ్‌బీ నుంచి 203 కోట్లు మంజూరు
  3. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

మంథని, డిసెంబర్ 20(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద మీదుగా దామెరకుంట వరకు 1.120 మీటర్ల పొడవు, 13 మీటర్ల వెడల్పుతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి.. ఆరెంద, మల్లారం, వెంకటాపూర్ నుంచి బ్రిడ్జి వరకు అటు సైడు దామెరకుంట రోడ్డు వరకు 9.530 మీటర్ల అప్రోచ్ రోడ్డుకు రూ. 203 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌అండ్ బీ శాఖ నుంచి నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

పెద్దపల్లి జిల్లా, మంథని మండల ప్రజలు, ఇతర మండలాల ప్రజలు మానేరు బ్రిడ్జి దాటి ఇతర జిల్లాలకు, మహారాష్ట్రకు, కాళేశ్వరం దేవాలయానికి, జయశంకర్ భూపాల పల్లి జిల్లాకి, ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి వీలుగా బ్రిడ్జి నిర్మాణం చేయాలని సంకల్పిం చి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి శ్రీధర్ బాబు ఆరెంద మీదుగా దామెరకుంట వరకు ఆర్‌అండ్‌బీ శాఖ నుండి రూ. 203 కోట్ల నిధులను మంజూరు చేయించారు.

ఈ బ్రిడ్జి నిర్మాణం వలన మంథని, పెద్దపల్లి జిల్లా ప్రజలకు కాళేశ్వరం వెళ్లడానికి 25 కిలోమీటర్ల వరకు దూరం తగ్గనుంది. అలాగే కాళేశ్వరం టూరిజం డెవలప్‌మెంట్ కూడా పెరుగుతుందని, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి వీలుంటుందని, జయశంకర్ భూపాలపల్లి, కాటారం వెళ్లడానికి వీలు ఉంటుందని, ఆరెంద, మల్లారం, వెంకటాపూర్, దామేరకుంట ఈ గ్రామాలలో ప్రజలకు రవాణా పరంగా,  వైద్య, విద్య పరంగా చాలా ఉపయోగపడుతుందని పలువురు పేర్కొంటున్నారు.

పెద్దపల్లి జిల్లా, జయశంకర్ భూపా లపల్లి జిల్లా కు మెరుగైన రావాణా సౌకర్యం పెరుగుతుందని,మానేరు పై బ్రిడ్జి అరెంద మీదుగా దామెర కుంట నిర్మాణానికి రూ. 203 కోట్ల నిధులు మంజూరు చేయించిన మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుకి పెద్దపల్లి జిల్లా ప్రజలు, మంథని మండల ప్రజలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలు, అరెంద, మల్లారం, వెంకటాపూర్, దామరకుంట గ్రా మాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.