21-12-2025 12:33:31 AM
ఖమ్మం టౌన్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): ఖమ్మం ఆర్టీవో కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు ఈ దాడు లు నిర్వహించామని ఆయన తెలిపారు. కార్యాలయంలో ఉండా ల్సిన డాకుమెంట్లు ఏజెంట్ల వద్ద దొరికాయని, అధికారులు ఏజెంట్‌లను ఏర్పాటు చేసుకొని కార్యాల యంకు వచ్చే వారి వద్ద ఎక్కువ మొత్తం వాసులు చేస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.
రూ.70 వేల నగదు ఏజెంట్‌ల వద్ద అనాధికారంగా దొర కిందని తెలిపారు. ఆర్ సి కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు సం బంధిత వ్యక్తులకు పోస్ట్ ద్వారా పంపాల్సి ఉండగా అవి ఏజెంట్‌ల వద్ద లభ్యమాయ్యాయని తెలిపా రు. అన్నీ మీడియా సమక్షంలో స్వాధీనం చేసుకొన్నామని విచారణ కొనసాగుతున్నదని తెలిపారు.