29-11-2025 12:47:41 AM
స్టార్ హీరో కార్తి నటిస్తున్న తమిళ చిత్రం ‘వా వాతియార్’. ఇది తెలుగు ప్రేక్షకుల ముం దుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్‌తో రాబోతోంది. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశా రు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్; డీవోపీ: జార్జ్ సీ విలియమ్స్; ఎడిటింగ్:- వెట్రే కృష్ణన్; నిర్మాత: జ్ఞానవేల్ రాజా; రచన, దర్శకత్వం: నలన్ కుమారస్వామి.