01-05-2025 10:07:45 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ లో పాణిపూరి తిని ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. బాధిత కుటుంబీకులు వివరాలు తెలిపిన ప్రకారం.. కాల్ టెక్స్ లో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మేరుగు సంగీతా దేవి(32), మేరుగు అనుప్రియ(6), కాదాసి త్రిషిక(21) చిలివేరి అక్షయని(9), చిలివేరి వాషిత(7), పుల్లె శ్రీకాంత్(28) లు అక్కడికి వెళ్ళి పాణిపూరి తిన్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఒంటి గంట సమయంలో వీరంరూ వాంతులు, విరోచనాలు చేసుకున్నారు.
కడుపు నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరీక్షించిన పిల్లల వైద్యలు పరీక్షించి తగు చికిత్స అందించారు. బాధితులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్సలు అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపర్ అన్నింటి డాక్టర్ జి డి రవికుమార్ తెలిపారు.