calender_icon.png 2 May, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిరుదొడ్డి పోలీసు స్టేషన్ లో ఏసిపి సోదాలు

01-05-2025 10:08:47 PM

హోంగార్డు అరెస్టు...

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌ను ఏసీబీ అధికారులు గురువారం తనిఖీ చేశారు. కేసు తొలగింపునకు లంచం డిమాండ్ చేసినట్టు వచ్చిన ఫిర్యాదుతో అధికారులు ఈ దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన అమీర్ దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట నుంచి మిరుదొడ్డి మీదుగా హైదరాబాద్ కు వెళుతున్న క్రమంలో మిరుదొడ్డి శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పి స్థానికుడైన రాజు వాహనాన్ని డికోట్టాడు. రాజు అదే రోజు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే క్రమంలో హోంగార్డు సంతోష్ మధ్యవర్తిత్వం వహించి ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తాననీ, ఇందుకుగాను రూ.15వేలు లంచం ఇవ్వాలని హోంగార్డు సంతోష్ గౌడ్ రాజుతో రూ.10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

అమీర్ ను లంచం అడగటంతో అసంతృప్తి చెందిన అమీర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఒప్పంద ప్రక్రియలో హోంగార్డు సంతోష్ రూ.2 వేలు స్వీకరించారు. మిగతా రూ.8 వేలలో పరోక్షంగా ముట్టజెప్పాలని  సూచించారు. అందులో గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకుదికి రూ.2 వేలు,  మద్యం దుకాణ కార్మికుడికి రూ.3 వేలు, ద్విచక్ర వాహన మరమ్మత్తుదారుకు మరో రూ.3 వేలు రాజుకు ఇవ్వాలని సూచించారు. మిగిలిన రూ. 2 వేలు ఫిర్యాదుదారుణనీ వద్ద ఉన్నాయి.  లంచం వ్యవహారంలో ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని మిరుదొడ్డి స్టేషన్ లో విచారణ చేపట్టారు.  ఈ ఘటనపై కేసు హోంగార్డు సంతోష్ పై కేసు నమోదు చేసి  రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.