calender_icon.png 2 May, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనపై మోదీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం

01-05-2025 10:01:04 PM

జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతల శంకర్ నేత..

కామారెడ్డి (విజయక్రాంతి): ప్రధాని మోదీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ రాబోయే జనాభా లెక్కలలో కులగణన చేర్చాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కామారెడ్డి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతల శంకర్ నేత, రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్ నేత, గురువారం ఒక సంయుక్త  ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాదులోనీ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో గుజ్జా సత్యం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ నేత ఆర్ కృష్ణయ్యను గురువారం ఆయా జిల్లాలో బీసీ నాయకులు రాష్ట్ర నాయకులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్యను శాలువాతో సత్కరించి పూల బోకెను అందించినట్లు తెలిపారు. ఆయన చేసిన కృషి నీ ఈరోజు కేంద్ర సర్కారు గుర్తించి మోదీ ప్రభుత్వం  తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనాలు కలగబోతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

కులగణన చారిత్రాత్మక నిర్ణయం

రాజకీయాలకు అతీతంగా మద్దతు పలకాలని కోరారు

ప్రధాని మోదీ నాయకత్వంలో రాజకీయ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ రాబోయే జనాభా లెక్కింపులో కులగణనను చేర్చాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు చింతల శంకర్ నేత రాష్ట్ర నాయకులు గుజ్జ సత్యం, అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, కుల సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు దీనికి సహకరించాలని వారు విజప్తి చేశారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగబోతోందని, అత్యంత శాస్త్రీయంగా కేంద్రం నిర్వహించే ఈ సర్వేలో కులాల వారీగా జనాభా వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఏ కులానికి నష్టం వాటిల్లకుండా రిజర్వేషన్ల అమలులో న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కులగణనకు వ్యతిరేకి అని, ఆ పార్టీ ఏనాడూ అనలేదని దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించకపోవడమే వారి అలసత్వానికి నిదర్శనమని అన్నారు.

కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చింతల శంకర్ నేత, రాష్ట్ర నాయకులు కాముని సుదర్శన్ నేత చెప్పారు. వారు మాట్లాడుతూ దేశంలో 94 ఏళ్ల తర్వాత మోదీ ఈ ప్రక్రియను తిరిగి ప్రారంభించడం పారదర్శక పాలనకు బీజేపీ 2014లో ఒక ఓబీసీ బిడ్డను ప్రధానమంత్రిని చేసిందని, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను, ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జాతీయ బిసి సంక్షేమ సంఘం లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాముని సుదర్శన్ నేత, శ్రావణ్ కుమార్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీ గాధ రాజేందర్, కూచి పెంటయ్య, నిల వెంకటేష్, వేముల రామకృష్ణ, నంద గోపాల్, రాజు నేత, రాములు యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మంజుల, ఆయా బిసి నాయకులు పాల్గొన్నారు.