calender_icon.png 29 September, 2025 | 9:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజంలో ఎవరి హక్కులకు భంగం కలిగించొద్దు

29-09-2025 07:10:53 PM

పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్..

పాపన్నపేట (విజయక్రాంతి): సమాజంలో ఎవరి హక్కులకు భంగం కల్గించొద్దని పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్, ఆర్ఐ నాగరాజు పేర్కొన్నారు. మండల పరిధిలోని కుర్తివాడలో బుధవారం పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. పౌర హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కుల వివక్ష, అంటరానితనాన్ని నిర్మూలించాలని, అన్ని కులాలు, వర్గాల వారు సోదరభావంతో మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పౌరుల హక్కులు, చట్టాల గురించి తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.