calender_icon.png 13 May, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రం సివిల్ సప్లై గోదాం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

13-05-2025 05:20:35 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని సివిల్ సప్లై (MLS) గోదాములో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్ మనోజ్ కుమార్(Assistant Manager Manoj Kumar) కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ(AITUC) జిల్లా అధ్యక్షుడు బి.అజయ్ సారధి రెడ్డి మాట్లాడుతూ... కేసముద్రంలోని సివిల్ సప్లై హమాలీ కార్మికులకు కాంట్రాక్టర్ వారికి రావలసిన డబ్బులను తగ్గించే ప్రయత్నం చేస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నాడన్నారని ఆరోపించారు.

అధికారులు జోక్యం చేసుకొని వెంటనే సమస్యను పరిష్కరించాలన్నారు. జిల్లాలోని అన్ని ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కార్మికులకు వసతులు కల్పించాలని, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వడ్డెబోయిన లక్ష్మీ నరసయ్య, వంకాయలపాటి జక్కరయ్య, చొప్పరి శేఖర్, మంద భాస్కర్ పెరుగు కుమార్, వెలుగు శ్రవణ్, రాజబోయిన శ్రీను, బానోతు రాజు, ధారావత్ బిచ్చు పాల్గొన్నారు.