calender_icon.png 13 May, 2025 | 10:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంతంగా పాలిసెట్ ప్రవేశ పరీక్ష

13-05-2025 05:29:50 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాలిసెట్-2025 ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పాలిసెట్(POLYCET) ప్రవేశ పరీక్ష ఎలాంటి అసౌకర్యాలు అవరోధాలకు తావు లేకుండా జరిగింది. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాశారు. ప్రత్యేకించి బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో అభ్యర్థుల హాజరు శాతాలు ఉత్తేజకరంగా నమోదయ్యాయి. బెల్లంపల్లిలో 1081 మందికి గాను 1026, మంచిర్యాలలో 2558 మందికి గాను 2397, ఆసిఫాబాద్ లో 1032 మందికి గాను 965, నిర్మల్ లో 2422 మందికి గాను 2305, ఆదిలాబాద్ లో 1102 మందికి గాను 1026 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు.

మంచిర్యాల, కొమురం భీం, ఆదిలాబాద్ జిల్లాల కోఆర్డినేటర్ డాక్టర్ M. దేవేందర్ రెడ్డి (ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బెల్లంపల్లి) సమర్థవంతంగా పర్యవేక్షించారు. రాష్ట్ర సాంకేతిక విద్యామండలి (SBTET) నుండి స్పెషల్ అబ్జర్వర్ గా తారాసింగ్ పర్యవేక్షించారు. అసిస్టెంట్ కోఆర్డినేటర్ గా బి వెంకటేశ్వర్లు, డీఈవో కార్యాలయం, మంచిర్యాల నుండి  పి మహేశ్వర్ రెడ్డి, కలెక్టరేట్ మంచిర్యాల నుంచి డీటీ లక్ష్మీ నారాయణ బెల్లంపల్లి ఎస్ హెచ్ ఓ దేవయ్య, అధికారులు సమన్వయంతో పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశారు. కోఆర్డినేటర్ డాక్టర్ దేవేందర్ రెడ్డి ప్రతి ఒక్కరికి ప్రశంసించారు.