calender_icon.png 13 May, 2025 | 10:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధిక తూకం వేస్తున్నారని రైతుల ఆందోళన

13-05-2025 05:16:38 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అధిక తూకం వేస్తూ క్వింటాల్కు 8 కిలోల వడ్లు దోపిడీ చేస్తున్నారని పిఎసిఎస్(PACS) కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. మంగళవారం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు సహకార సంఘం చైర్మన్ తో మాట్లాడగా అధిక తూకం విషయంలో ఎటువంటి సమాధానం ఇవ్వకపోగా అక్కడికి వచ్చిన సెక్రటరీనీ బంధించి ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ స్పందించి తగు విచారణ జరిపించాలని రైతులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎర్వ చింతల్ గ్రామ రైతులు పలువురు పాల్గొన్నారు.