03-05-2025 05:02:39 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్(District SP Sudhir Ramnath Kekan) ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీసులు శనివారం సిబ్బందితో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల ఆవరణలో పేరుకుపోయిన ఆకులు, చెత్త, చెదారం తొలగించి శుభ్రపరిచారు. దీనితో పోలీస్ స్టేషన్ల ఆవరణలో పరిశుభ్రంగా మారాయి.