03-05-2025 05:00:19 PM
మంథని (విజయక్రాంతి): మండలంలోని చల్లపల్లి గ్రామంలోని చేతి పంపు చెడిపోయి మరమ్మత్తుకు నోచుకోకపోవడంతో గ్రామస్తులు ఈ వేసవిలో మంచినీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఉన్న చేడిపోయిన చేతి పంపుకు మరమ్మత్తు చేయించాలని గ్రామస్తులు సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ కు తెలుపగా వెంటనే స్పందించిన చైర్మన్ శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో శనివారం మరమ్మత్తులు చేయించారు. అసలే ఎండాకాలం కావడంతో గ్రామస్తులు మంచినీటికి ఇబ్బందులు పడుతున్న క్రమంలో చైర్మన్ స్పందించి చేతి పంపుకు మరమ్మత్తులు చేయించడం పట్ల గ్రామస్తులు చైర్మన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.