21-09-2025 12:00:00 AM
ఐటీపీఐ తెలంగాణ, డెకాథ్లాన్ హైదరాబాద్, ప్రాస్పెరిటీ ప్లానెట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): డెకాథ్లాన్ హైదరాబాద్, ఐటీపీఐ తెలంగాణ రాష్ట్ర రీజినల్ చాప్టర్, ప్రాస్పెరిటీ ప్లానెట్ ఫౌండేషన్ సంయుక్తంగా శనివారం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద శుభ్రతా కార్యక్రమం నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని డెకాథ్లాన్ సోషల్ ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ లీడర్ మనీష్ ఆధ్వర్యం లో నిర్వహించారు. వలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులు కలసి సుమారు 60 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాన్ని సేకరించారు.
శుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రజా స్థలాలపై అవగాహన పెంచా రు. ఈ కార్యక్రమానికి భాగస్వాములం కావ డం గర్వకారణం అని ఐటీపీఐ తెలంగాణ రాష్ట్ర రీజినల్ చాప్టర్ చైర్మన్ ఎస్ దేవేందర్‌రెడ్డి అన్నారు. శుభ్రమైన నగరం కోసం పౌ రులు కలసి రావడం ప్రేరణాత్మకమని, ప్రతి ఒక్కరి చర్య ముఖ్యమే అని డెకాథ్లాన్ హైదరాబాద్‌కు చెందిన మనీష్ తెలిపారు. సమా జం కలిసికట్టుగా చేసే ప్రయత్నాలు శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని ప్రాస్పెరిటీ ప్లానెట్ ఫౌండేషన్ డైరెక్టర్ నవ్య అన్నారు.