20-09-2025 11:31:31 PM
మంత్రి దామోదర రాజానర్సింహాకు వినతి
బోథ్,(విజయక్రాంతి): బోథ్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆరోగ్య వైద్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహాను కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆడే గజేందర్ కొరారు. శనివారం హైదరాబాద్ లో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. దింతో సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలోనే చర్చించి ఆసుపత్రులలో కొరతగా ఉన్న వైద్యులను వైద్య సిబ్బందిని నియమించి ఆసుపత్రుల అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్యం అందేలా చూడాలని తెలిపారని అన్నారు.