calender_icon.png 25 December, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి విజన్ ఉన్న నాయకుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

25-12-2025 02:43:04 AM

నిజామాబాద్, డిసెంబర్ 24,(విజయ క్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడనీ,గ్లోబల్ సమ్మిట్ లో లక్షల 70 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఇందుకు ఒక ఉదాహరణ అని పి సి సి అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.

తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా పనిచేస్తున్నాయని, పదేళ్ల విధ్వంసం నుండి వికాసం దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లాను ఎడ్యుకేషన్  హబ్ గా మారుస్తున్నామని అన్నారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తంలో అత్యధిక కాంగ్రెస్ సర్పంచులు నిజామాబాద్ జిల్లాలో గెలుపొందారనీ ఎందుకు సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఫిరాయింపుల అంశం స్పీకర్ ఫరీదిలో ఉందని, స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించటం  లేదని,దానం నాగేసందర్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాం అని చెప్తున్నారనీ కానీ టెక్నికల్ గా పార్టీ మారలేదు అని చెప్తరని అన్నారు. కెసిఆర్ ఉదాసీనతవాళ్లనే నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే జీఓ లు పారదర్శకంగా ఉన్నాయనీ,90 శాతం జీఓ లు అన్ని పబ్లిక్ డిమైన్ లో పెట్టామన్నారు. పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో ఒక్క జీవో కూడా బహిర్గతం చేయలేదనీ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్దనేరమని,గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చాలా పెద్ద నేరానికి పాల్పడిందనీ,నేరం ఎవరు చెప్పినా శిక్ష తప్పదనీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.