14-12-2025 12:53:08 AM
శంషాబాద్ విమానాశ్రయానికి తరలివెళ్లిన సీఎం, మంత్రులు
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఫుట్‌బాల్ క్రీడాకారుడు, మెస్సి, సీఎం రేవంత్‌రెడ్డి ఉప్పల్ స్టేడియంలో ఆడునున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌ను తిలకించేందుకు రాహుల్‌గాంధీ హైదరాబాద్‌కు వచ్చారు.
దీంతో రాహుల్ గాంధీకి సీఎంతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ కార్యదర్శి విశ్వనాథ్, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తదితరులు స్వాగతం పలికారు.
అనంతరం రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, మహేష్ కుమార్‌గౌడ్ ముగ్గురు ఒకే కారులో ఏయిర్‌పోర్టు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్‌కు వెళ్లారు. ఫలక్ నుమా ప్యాలెస్‌లో మెస్సీ హాజరైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ, అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియానికి వెళ్లారు. మ్యాచ్ అనంతరం రాహుల్‌గాంధీ తిరిగి ఢిల్లీకి వెళ్లారు.