19-11-2025 01:05:38 AM
మేడ్చల్ అర్బన్, నవంబర్ 18 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని రెండవ వార్డుకు చెందిన మహాలక్ష్మికి రూ. 24 వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ మంత్రి వర్యులు మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగిందని మున్సిపల్ పట్టణ 2 వార్డు బిఆర్‌ఎస్ బిసి సెల్ అధ్యక్షులు మండల రవికుమార్ తెలిపారు.
ఈ సందర్భంగా రవి కుమార్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రోత్సాహంతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బాధితురాలు మహాలక్ష్మికి ఇవ్వడం జరిగిందని చెప్పారు. మున్సిపల్ రెండవ వార్డు బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మండల ఈశ్వరయ్య, మండల రామ్ చంద్రయ్య, మండల దశరథ, రాజ్ గోపాల్, డాక్టర్ పగడయ్య, వేణుగోపాల్ పాల్గొన్నారు.