calender_icon.png 19 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహకరించండి!

19-11-2025 12:24:11 AM

రాష్ట్ర ప్రాజెక్టులపై కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

  1. హైదరాబాద్ అభివృద్ధ్ది చెందితే.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమౌతుంది  
  2. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ విడుదల 
  3.   3 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం: సీఎం

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం త్వరగా అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ప్రాజెక్టులను వేగంగా అనుమతులు లభిస్తే హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని, ఆ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థల్లో రాష్ట్రం మరింత కీలకంగా మారుతుందని సీఎం పేర్కొన్నారు.

మంగళవారం హోటల్ ఐటీసీ కోహినూర్‌లో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధ్ది మంత్రుల ప్రాంతీయ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, ఏపీ మంత్రి పొంగనూరు నారాయణ, గుజరాత్ రాష్ట్ర మంత్రి కనుభాయ్ మోహన్‌లాల్ దేశాయ్, తెలంగాణ సీఎస్ రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త నగరాన్ని నిర్మించాలని భావిస్తున్నామని, అందుకు తెలంగాణ రైజింగ్- 2047 పేరుతో కొత్త ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించిందని, ఈ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న విడుదల చేయబో తున్నట్లు వివరించారు.  హైదరాబాద్‌కు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

ప్రపంచంలో ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్రం కృషి చేస్తోందని, కేంద్రం ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ కూడా భాగమవుతుందన్నారు. రాష్ట్రా లకు కేంద్రం సహకరిస్తే దేశాభివృద్ధ్ది మరింత వేగవంతమవుతుందని సీఎం పేర్కొన్నారు. కేంద్రం నిర్దేశించుకన్న 30 ట్రిలిట్ డాలర్ల ఎకానమీలో తెలంగాణ రాష్ట్ర వాటా 10 శాతం ఉండాలని భావిస్తున్నామన్నారు.

2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి మూడో ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో తాము పని చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జీడీపీలో ప్రధానంగా 5 మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముం బాయి, బెంగళూరు. చెన్నై, హైదరాబాద్ నగరాలు దేశానికి ఎంతో కీలకంగా ఉన్నాయని చెప్పారు. అయితే రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరించకుంటే అభివృద్ధి కుం టుంపడుతుందని తెలిపారు.

హైదరాబాద్ మెట్రో రైలు, రీజినల్ రింగ్‌రోడ్డు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాల తరలింపు, హైదరాబాద్‌ల కాలు ష్యం, ట్రాఫిక్ సమస్య తగ్గించేందుకు, మూసీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. వచ్చే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నామన్నారు. దేశాని కి పెద్దన్నగా ఉన్న ప్రధాని మోదీ సహకరిస్తే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

మోదీ గుజరాత్ మోడల్  రూపొందించుకున్నట్లే .. తాము తెలంగాణ మోడల్ తీసుకొచ్చామన్నారు. అంతే కాకుండా ప్రధాని మోదీ సబర్మతినది ప్రక్షాలన చేపట్టినట్లే .. తాము మూసీ పునరుజ్జీవం చేస్తున్నా మని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. గుజరాత్‌కు మోదీ ఇచ్చిన సహకారాన్నే.. తమ ప్రభుత్వం కూడా కోరుకుంటున్నదని చెప్పా రు. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దామని, ఆ తర్వాత అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. 

మా పోటీ సింగపూర్, టోక్యో, న్యూయార్క్‌తో.. 

హైదరాబాద్ నగర అభివృద్ధితో పాటు తాము 3 వేల ఎకరాల్లో  భారత్ ప్యూచర్ సిటీని అభివృద్ధిని చేయబోతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి  వివరించారు. ఈ సిటీ న్యూ యార్క్, టోక్యో, జపాన్, సింగపూర్, దుబా య్ వంటి నగరాలతో పోటీపడేలా నిర్మించబోతున్నట్లు సీఎం తెలిపారు.  రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలనే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. తమ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదని, ప్రపంచ నగరాలతోనేనన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. మాకు ఇరు గు, పొరుగున ఉన్న రాష్ట్రాలు తమకు స్నేహపూర్వక రాష్ట్రాలేనని తెలిపారు.