19-11-2025 01:07:43 AM
మేడ్చల్ అర్బన్ నవంబర్ 18 (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల డయాలసిస్ సెంటర్‌ను ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి చెందిన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనురాద సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న 25 మంది రోగులను పరిశీలించి అవసరమైన మందులు ఇవ్వడం జరిగిందన్నారు.
ఆసుపత్రిలోని డయాలసిస్ సెంటర్ లోని మెడికల్ రికార్డులను డాక్టర్ అనురాధ పరిశీలించడంతో పాటు ఆర్వో ప్లాంట్‌ను కూడా తనిఖీ చేసినట్లు చెప్పారు. ఆసుపత్రిలో రోగుల పట్ల సమర్థవంతమైన సేవలు అందిస్తున్నందుకు ఆసుపత్రి సిబ్బందిని ఆమె ప్రశంసించినట్లు స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడి వారి అభిప్రా యాలను కూడా సేకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఏపి మెడికల్స్ జనరల్ మేనేజర్ శివకుమార్, యూనిట్ ఇంచార్జ్ రోహిత్‌లతో పాటు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.