19-11-2025 12:41:15 AM
హుస్నాబాద్, నవంబర్ 18: మావోయిస్టు పార్టీలో చేరినప్పటి నుంచి దళంలో అత్యంత వేగంగా ఎదిగిన వ్యక్తి హిడ్మా. అయితే ఆయన జీవితంలో, వ్యూహాల్లో అందరికీ తెలియని ఒక కోణం ఉంది. అది తెలంగాణలోని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌తో ఆ యనకు ఉన్న అనుబంధం. ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలపై దాడులు నిర్వహించి యా వత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హిడ్మా, పదేండ్ల క్రితం సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్‌లో ఒక సాధారణ కూలీగా తిరిగాడు.
ఆ సమయంలో ఇక్కడ జరుగుతున్న గౌరవెల్లి ప్రాజెక్టు టన్నెల్ పనుల్లో కూలీల రూ పంలో మావోయిస్టులు చొరబడ్డారనే నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిఘా బృం దాలు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అందులో హిడ్మా కూడా ఉన్నా డు. అతని భాష పోలీసులకు సరిగా అర్థం కాలేదు. అతని వద్ద దొరికిన స్మార్ట్ ఫోన్లోని కొన్ని వీడియోలు చూసి పోలీసులు ఖంగుతిన్నారు.
వెంటనే అతన్ని అరెస్ట్ చేసి రిమాం డ్‌కు పంపారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైన హిడ్మా తిరిగి ఛత్తీస్‌గఢ్ వెళ్లిపోయాడు. హుస్నాబాద్‌లో కూలీగా వ్యవహరిస్తూనే ఆయన పార్టీ రహస్య కార్యకలాపాలు పూర్తి చేశాడనే విషయం పోలీసులకు తర్వాత అర్థమైంది. ఎవరికీ అనుమానం రాకుండా వ్యూ హాలు అమలు చేయడంలో, పార్టీని విస్తరించడంలో హిడ్మాకున్న పట్టుకు ఈ సంఘటన ఒక నిదర్శనం.
దండకారణ్యం యుద్ధ వీరుడు
పుట్టింది దక్షిణ బస్తర్‌లోని సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో అయినప్పటికీ, హిడ్మా మావోయిస్టు పార్టీకి అత్యాధునిక యుద్ధరీతులు నేర్పిన కీలక వ్యక్తిగా చరిత్రలో నిలి చాడు. 1996- ప్రాంతంలో 17 ఏండ్ల వ యసులో మావోయిస్టు పార్టీలో చేరిన హిడ్మా, కొత్త విషయాలు నేర్చుకోవడంలో చూపిన ఆసక్తితో మొదట ఆయుధాల త యారీ, రిపేర్ల విభాగంలో పనిచేశాడు. ఇక్కడ స్థానికంగా గ్రనేడ్లు, లాంఛర్లు తయా రు చేయించాడు.
2007లో ఉర్పల్ మెట్టలో 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మృతి, 2010 ఏప్రిల్లో తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసుల మృతి, 2017 మార్చిలో 12 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మృతి వం టి అనేక ఘోరమైన దాడుల్లో హిడ్మా పాత్ర ఉన్నట్టు చెబుతారు. 2021లో బీజాపూర్‌లో 22 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన దాడికి కూడా హిడ్మానే రూపకల్పన చేశాడు. ఈ దాడిలో భద్రతా దళాలను ‘వీ’ ఆకారంలో ఉచ్చును పన్ని, బయటపడకుండా చేశారు.
ఇది మా వోయిస్టుల యుద్ధ వ్యూహంలో కొత్త కో ణంగా అభివర్ణించారు. ఆయనకు సంతోష్, పోడి యం భీమా, మనీశ్ అనే పేర్లు కూడా ఉన్నా యి. తాడ్మెట్లలో 76 మంది జవాన్లను హత్య చేసిన ఉదంతం తరువాత మావోయిస్టు పార్టీలో ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగించినట్టు చెబుతున్నారు. ఝీరం లోయ ఘట న వెనుక సూత్రధారి కూడా హిడ్మానే అని అంటుంటారు. హిడ్మా తలపై రూ.35 లక్షల రివార్డు కూడా ఉంది.
2010 నుంచి ఇప్పటి వరకూ మూడుసార్లు హిడ్మా మరణించినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆయన ఇప్పుడు ఒక వ్యక్తి కాదని, అది ఒక హోదాగా మారిందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు పార్టీలో ఇలాంటివి సహజంగానే కనిపిస్తుంటాయని వారు అంటున్నా రు. కొన్నేండ్ల నుంచి హిడ్మా, ఆయన బృం దం కోసం ఉసూర్, పామేడ్, తర్రెమ్, మి న్పా, నర్సాపురం క్యాంపుల్లోని ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, డీఆర్జీ, కోబ్రా బెటాలియన్లకు చెం దిన దాదాపు 2 వేల మంది భద్రతా బలగా లు ’ఆపరేషన్ హిడ్మా’ చేపట్టాయి.
హిడ్మా, ఆయన సహచరుల కోసం గాలించేందుకు భద్రతా దళాలు గుండం, అలీగూడెం, టెక్లాగూడెం ప్రాంతాలకు వెళ్లా యి. కానీ, వారికి మావోయిస్టుల ఆచూకీ దొరకలేదు. అయితే ఆయన బృందాన్ని ఎప్పుడో పట్టుకొని ఇ ప్పుడు చంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మావోయిస్టుగా సుదీర్ఘ ప్రయాణం
గతంలో చాలా మంది బలమైన నక్సలైట్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. వారంతా ఎంతో దుందుడుకుగా పోలీసులపై దాడులకు దిగారు. కానీ, వారందరి కంటే హిడ్మా చురుకుగా ఉన్న సమయం ఎక్కువ. బాగా పేరొచ్చి దుందుండుకుగా సాగే మావోయిస్టులు ఎక్కువ కాలం అలా ఉండలేరు. వారు చనిపోవడమో లేక లొంగిపోవడమో జరుగుతుంటుంది. అయితే హిడ్మా చాలా కాలం నుంచీ క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. తాజా ఘటనలో హిడ్మా ప్రత్యక్షంగా ఉన్నాడని పలువురు పోలీసులు ధ్రువీకరించారు.
హిడ్మాకు మెళకువలు నేర్పింది చలపతే
సల్వాజుడుం సృష్టికర్త మహేంద్రకర్మ టార్గెట్గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మా లోయలో జరిపిన దాడిలో హిడ్మా కీలకపాత్ర పోషించారు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. నాటి ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మురియా తెగకు చెందిన ఆదివాసీ హిడ్మా. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లిన హిడ్మా విప్లవ భావాలను నరనరాన ఒంట బట్టించుకున్నారు. పదోతరగతి వరకే చదివినా.. ఇంగ్లిష్లో గుక్కతిప్పుకోకుండా మాట్లాడగలడు.
ఇక మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ భద్రన్న నేతృత్వంలో సాయుధపోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ దాడిలో 76 మంది CRPF జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారు. గెరిల్లా పోరులో హిడ్మాకు మెళకువలు నేర్పింది కూడా చలపతే.
హిడ్మా స్కెచ్ వేస్తే..
మొత్తం 26 దాడుల్లో హిడ్మా కీలక నిందితుడు..
* 2007లో సుక్మా జిల్లా ఉర్పల్మెట్లో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి, హతమార్చారు
* 2010లో తడ్మెట్ల మెరుపు దాడిలో 76 మంది జవాన్లు మృతి చెందారు
* 2013లో జీరామ్ఘాటీ వద్ద కాంగ్రెస్ నేతలను ఊచకోత ఘటనలో హిడ్మాదే కీలక పాత్ర
* 2017 ఏప్రిల్లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను హతమార్చాడు
* 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కుకుని 23 మంది జవాన్లు మృతిచెందారు
ఎవరీ మడావి హిడ్మా?
హిడ్మాను కలిసిన వారు, ‘ఈయనేనా ఇంత విధ్వంసం సృష్టించింది?’ అని ఆశ్చర్యపోయేంతగా ఆయన చాలా సౌమ్యం గా, మృదువుగా మాట్లాడతాడని మాజీ మావోయిస్టులు తెలిపారు. ఆయన నాయకత్వంలోని దళం చాలా చురుగ్గా పనిచేసినా, హిడ్మా మాత్రం స్వయంగా తుపాకీ వాడడం చాలా అరుదని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ అడవుల్లోకి చొరబడి ఉద్యమాన్ని పునర్ని ర్మించాలని చూస్తున్న సమయంలో, ఏపీ పోలీసుల ఎదురుకాల్పుల్లో హిడ్మా, అతని భార్య రాజె సహా ఆరుగురు మావో యిస్టులు మరణించడం మావోయిస్టు ఉద్యమానికి ఒక గట్టి ఎదురుదెబ్బ. నిరక్షరాస్యుడై ఉండి కూడా ఇంగ్లిష్, హిందీ నేర్చుకో వాలనే ఆసక్తి ప్రదర్శించిన ఈ వ్యూహకర్త కథ, దండకారణ్యం చరిత్రలో ఒక ఉగ్రరూపంగా మిగిలిపోనుంది.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు- పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల ఘటన తరువాత మావోయిస్టు హిడ్మా పేరు బాగా చర్చల్లోకి వచ్చింది. సుమారు 50 ఏండ్ల వయసు, సన్నగా ఉండే ఈ మావోయిస్టు, దాదాపు దశాబ్దంన్నర కాలంగా దండకారణ్యం లో అత్యధిక సంఖ్యలో పోలీసుల మరణాలకు కారకుడిగా చెబుతున్నారు. ఈ వ్యక్తి ఇన్ని వ్యూహాలు రచించగలడా? అని ఆయన ను కలిసిన వారు ఆశ్చర్యపోతారు అని హిడ్మా గురించి తెలిసినవాళ్లు చెబుతారు.
గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసి, బయ టకు వచ్చిన కొందరితో ‘విజయక్రాంతి’ మాట్లాడింది. ఆయన చాలా సౌమ్యంగా, మృదువుగా మాట్లాడుతాడని, ఆయన మాట తీరు విని ఈయనేనా ఇంత విధ్వంసం సృష్టించింది అనుకుంటారని చెబుతున్నారు. సౌమ్యంగా మాట్లాడే ఆ హిడ్మాయే దాదాపు పదికి పైగా దాడుల్లో పదుల సంఖ్యల్లో భద్రతా బలగాల మరణానికి కారకుడుయ్యాడు. మావోయిస్టు పార్టీలో హిడ్మా ఎదుగుదల ఆశ్చర్యకరమైన ప్రస్థానం.
తన 17వ ఏట మావోయిస్టు పార్టీలో చేరాడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలోని పువర్తిలో పుట్టాడు. ఆ గ్రామం నుంచి దాదాపు 4,0-50 మంది మావోయిస్టులు ఉంటారని అంచనా. పార్టీలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసుకునేవాడు. ఎక్కువగా మాట్లాడే అలవాటు లేని హిడ్మా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తాడు. ఆ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలసి పనిచేసిన ఒక లెక్చరర్ ద్వారా ఇంగ్లిష్ నేర్చుకున్నాడు.
తన మాతృభాష కాని హిందీని కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ఆయన చదివింది మాత్రం 7వ తరగతే. హిడ్మాను 2000వ సంవత్సరంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలం అక్కడ కూడా ప్రదర్శించాడని చెబుతారు. 2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్లో ఎదిగాడు. తరువాత మావోయిస్టు సాయుధ విభాగం పీఎల్జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ)లో చేరాడు.
2001-2007 ఏడు మధ్య హిడ్మా సాధారణ మావోయిస్టు పార్టీ సభ్యుడుగానే ఉన్నాడు. 2007వ సంవత్సరం మార్చి నెలలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. ఇందులో 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు మరణించారు. హిడ్మా నాయకత్వంలో ఈ దాడి జరిగిందని చెబుతారు. 2008-09 ప్రాంతంలో హిడ్మా మావోయిస్టు పార్టీ అప్పుడే ఏర్పాటు చేసిన ఫస్ట్ బెటాలియన్‌కు కమాండర్ అయ్యాడు.
ఈ ఫస్ట్ బెటాలియన్ బస్తర్ ప్రాం తంలో చురుగ్గా ఉండేది. తరువాత 2011లో దండకారణ్యం స్పె షల్ జోనల్ కమిటిలో సభ్యుడయ్యాడు. 2010 ఏప్రిల్‌లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసులు మరణించారు. 2017 మార్చిలో 12 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మృతి చెందారు. ఈ రెండు ఘటనల్లో హిడ్మా పాత్ర ఉందని చెబుతారు.