19-11-2025 01:10:46 AM
పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీందర్ రెడ్డి
అబ్దుల్లాపూర్ మెట్, నవంబర్ 18: విద్యార్థులు మారకద్రవ్యాలకు దూరంగా ఉండా లని పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీందర్ రెడ్డి అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధి తట్టి అన్నారంలోని శ్రేయస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు మారక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రవీందర్ రెడ్డి హాజరై మారక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించి.. ప్రతిజ్ఞ చేయించారు. అలాగే కుంట్లూరు లోని మహిళా స్వశక్తి భవన్ లో మహిళా స్వయం, సహాయక సంఘ సభ్యులచే, ప్రజలకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కమిషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..
విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మాదకదవ్యాలకు బారిన పడిన వారు ఉంటే 14446 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇచ్చి డీ_ అడిక్షన్ సెంటర్లకు తరలించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీఈ సుమంత్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ వీ హరి కుమార్, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ ఆర్. శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ సరోజ, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది, రీసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.
పోచారంలో ..
ఘట్‌కేసర్, నవంబర్ 18 (విజయక్రాంతి) : పోచారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మంగళవారం యాంటీ నార్కోటిక్ ప్లీడ్జ్ (మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ- 2025) లో భాగంగా ప్రతిజ్ఞ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో కమిషనర్ నిత్యానంద, మేనేజర్ అశోక్, మెప్మా సిబ్బంది, ఇతర మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
డ్రగ్స్ మమ్మారిపై విస్తృత ప్రచారం చేయాలి
రంగారెడ్డి, నవంబర్ 18(విజయక్రాంతి): మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాల నిరోధానికి విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్ర మాలు నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత సంబంbధిత అధికారులకు సూచించారు.
మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నషా ముక్త్ భారత్ అభియాన్ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సంగీత మిషన్ పరివర్తన సామూహిక ప్రతిజ్ఞ ‘నేను మాదక ద్రవ్యాల పై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ, నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని,
డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని‘ ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ మామ్మరిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, డిపిఓ సురేష్ మోహన్, ఈ.డి. ఎస్సీ కార్పొరేషన్ పద్మావతి, పిడి మెప్మా వెంకట నారాయణ, సంబంధిత అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.