01-01-2026 12:00:00 AM
చిన్నంబావి, డిసెంబర్ 31: మండల పరిధిలోని కొప్పునూర్ గ్రామానికి చెందిన బూర్గుల మహేష్ అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతుండగా ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.లక్ష 50 వేల ఎల్వోసీ చెక్కును బుధవారం బాధిత కుటుంబానికి గ్రామ సర్పంచ్ వడ్డేమాన్ బిచ్చన్న అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవేట్ ఆసుపత్రులలో చికిత్స చేయించుకున్న అనారోగ్య బాధితులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో సీఎం సహాయనిధి రూపంలో సహాయం చేయడం జరుగుతుందన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచు సుదర్శన్ రెడ్డి, జంగా బీచుపల్లి యాదవ్, తలారి నిర్మల, తగరం శ్రీను, సాంబ, సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.