20-05-2025 10:38:36 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు(CS K Ramakrishna Rao)ను ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సచివాలయంలో చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావును ఎమ్మెల్యే కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో పలువురు రాష్ట్ర శాఖ అధికారులు ఉన్నట్లు తెలిపారు.