13-05-2025 01:36:27 AM
- వాణిజ్యపన్నుల శాఖలో మంచి ప్రగతి కనిపించింది
- రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): గతేడాదితో పోలిస్తే కమర్షియల్ టాక్స్(వాణిజ్యపన్నుల శాఖ)లో మొత్తంగా 6శాతం ప్రగతి కనిపించిందని, ఇదొక మంచి పరిణామమని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క అన్నారు. మార్చి నెలలో సీఎస్టీ, వ్యాట్ ఓవరాల్ గ్రోత్ రూ.600కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంటే సుమారు రూ.500 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరిందని చెప్పారు.
భవిష్యత్‌లోనూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులను భట్టి ఆదేశించారు. సోమవా రం రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భట్టివిక్రమార్క మాట్లాడుతూ..ఎక్సైజ్‌శాఖ ద్వారా ఆదాయం పెంచుకునే క్రమంలో ఎక్కడైనా లీకేజీలు ఉంటే గుర్తించి సరిచేయాలని ఆదేశించారు. అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్ల విక్ర యాల్లో మంచి ప్రగతి కనిపిస్తున్నా వ్యవసా య భూములు, ఓపెన్ ప్లాట్ల విక్రయాల్లో ఆశించినంత వేగం కనిపించడం లేదన్నారు. రవాణా శాఖలో కొత్తగా తీసుకొచ్చిన ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నేజేషన్ (ఏఎన్ పీఆర్) వివిధ శాఖల్లోనూ విస్తృతంగా వినియోగించుకుని, పెద్దమొత్తంలో తనిఖీలు చేపట్టాలని మంత్రుల బృందం ఆదేశాలు జారీచేసింది.
గిరిజన ప్రాంతాల్లో ఉన్న సొసైటీల ద్వారా ఇసుక అమ్మకాలు జరపాలని, నిజమైన వారిని గుర్తించి ట్రైబల్ సొసైటీలో సభ్యులుగా చేర్చాలని సూచించారు. సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, కమర్షియల్ టాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్, కమర్షియల్ టాక్స్ కమిషనర్ హరిత, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సురేంద్రమోహన్, రిజిష్ర్టే షన్ కమిషనర్ బుద్ధప్రకాశ్‌జ్యోతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరు లు పాల్గొన్నారు.