28-09-2025 04:52:35 PM
సదాశివపేట (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 60 వేల రూపాయల చెక్కును టీజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, సహకారంతో శనివారం సాయంత్రం సదాశివపేట పట్టణంలోని దొడ్ల నాగేష్, కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని సదాశివపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా ఉంటుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుండు రవి, పట్లూరి నాగరాజుగౌడ్, రాయపాడు రమేష్ జి టి ఆర్ డెవలపర్స్ గారెల తుల్జారాం, గ్రాడ్యుయేట్ అధ్యక్షులు దొడ్ల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.