calender_icon.png 28 September, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత స్వయం ఉపాధి కల్పించుకొని ఎదగాలి

28-09-2025 04:55:23 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..

చిట్యాల (విజయక్రాంతి): యువత స్వయం ఉపాధి కల్పించుకొని స్వశక్తితో ఎదగాలని కార్నివాల్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) అన్నారు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ సమీపంలో నేషనల్ హైవే 65 వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కార్నివల్ రెస్టారెంట్ ను రోడ్లు భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం ముఖ్య అతిధులుగా పాల్గొని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయని, ప్రభుత్వం అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని, యువత స్వయం ఉపాధి కల్పించుకొని స్వశక్తితో ఎదగాలని అన్నారు.

కష్టపడనిదే ఏది సాధించలేమని, నూతనంగా రెస్టారెంట్ ను ఏర్పాటు చేసిన యువకులను అభినంధించి రెస్టారెంట్లో వంటగదిని నిత్యం పర్యవేక్షిస్తూ ఆహార పదార్థాలు నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని, హైవేపై వచ్చి పోయే ప్రయాణికులకు రుచి కరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించిన యువకులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం, ఏనుగు రఘు మా రెడ్డి, ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.