calender_icon.png 15 September, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా సీఎం రిలీఫ్‌ఫండ్

15-09-2025 12:20:44 AM

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 

కామారెడ్డి, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి) : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఎంతో అండగా నిలుస్తుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లక్ష్మీదేవి గార్డెన్లో తాడువాయి, రామారెడ్డి, సదాశివ నగర్, రాజంపేట మండలాల కు చెందిన 53 మంది లబ్ధిదారులకు 17,57, 500 రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సేవలు పొందేందుకు అండగా నిలబడడం ఎంతో సంతృప్తికరమైన విషయం అని అన్నారు.

ఇప్పటివరకు అత్యధికంగా సీఎం ఆర్ ఎఫ్, ఎల్ ఓ సి చెక్కులను పంపిణీ చేయడంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలోని మొదటి స్థానంలో ఉందన్న విషయాన్ని గర్భంగా చెప్పగలగడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే అందే సాయం ప్రతి ఒక్కరికి సమర్థంగా అందేలా ప్రత్యేకంగా నిర్మించబడిన తమ టీం 24 గంటల పాటు పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. వైద్య అవసరాలకు ఎవరైనా సాయం కావాలంటే ఎల్లప్పుడూ తన సాయం అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సహాయ పథకాలు ఎన్నో కుటుంబాలకు జీవనధారంగా మారుతున్నాయని పేర్కొన్నారు. అవసరమైన ప్రతి ఒక్కరికి సరైన సమయంలో సరైన విధంగా సాయం అందించడమే ఆ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సంగారెడ్డి, ప్రవీణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్ల రాజేందర్, బొల్లిపల్లి మహేందర్ రెడ్డి, లింగ గౌడ్, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో..

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 14 (విజయక్రాంతి)ః  ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు జీవనాధా రంగా మారుతున్నాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు.. ఆదివారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట గాంధారి లింగంపేట మండలా లకు చెందిన సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులైన 59 మందికి 16 లక్షల 95వేల విలువైన సీఎం అఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ మాట్లాడుతూ&. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులను పంపిణీ చేయడం తనకు వ్యక్తిగత సంతృప్తిని ఇచ్చిందని అన్నారు. అనారోగ్యానికి గురైన వారి మెరుగైన వైద్యం అందించడంఅందించడం కోసం తన వద్ద ఉన్న టీం 24 గంటలు పని చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు వైద్యరంగం ద్వారా అనేక సేవలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆర్డిఓ పార్థసింహారెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి, మండల అధ్యక్షుడు కురుమ సాయిబాబా, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.