calender_icon.png 15 September, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగ ఆత్మీయ సమ్మేళనం సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

15-09-2025 12:20:37 AM

గంభీరావుపేట, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా మాదిగల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదిగ ఆత్మీయ సమ్మేళనం - సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ ఐక్య వేదిక నాయకులు పిలుపు నిచ్చారు. గంభీరావుపేటలో జరిగిన సన్నాహక సమావేశంలో మాదిగ ఐక్య వేదిక నాయకులు కత్తెర దేవదాస్, అంకని భాను, లక్ష్మీ నారాయణ, వెంకట రాములు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగ జాతి ఐక్యతను ప్రదర్శించే చారిత్రాత్మక వేదికగా ఈ సమ్మేళనం నిలవాలి. మంగళవారం 16న సిరిసిల్ల లో జరిగే మహోత్సవానికి ప్రతి గ్రామం నుండి భారీ స్థాయిలో ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలిపించారు. ఈ మహోత్సవానికి రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ/ వికలాం గుల మరియు వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

అలాగే మనకొండూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కావ్వంపల్లి సత్య నారాయణ, మాదిగ జాతి ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతారావు, వేముల వీరేశం, మందుల సామె ల్, కాలే యాదయ్య, కోనింట్ మాణిక్ రావ్, విజేయుడు పాల్గొననున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీం, వేములవాడ ఎమ్మెల్యే & ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గౌరవ అతిథిగా, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కె.కె. మహేందర్ రెడ్డి ఆత్మీయ అతిథిగా హాజరుకానున్నారు.

కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు ఎర్రోళ్ల శంకర్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బరుకుటం తిరుపతి, ప్రధాన కార్యదర్శి శనిగరపు నరే ష్ వర్మ, ఉపాధ్యక్షుడు ఇరిగి సందీప్, సీనియర్ నాయకులు గ్యార శంకర్, గొల్లపల్లి స్వామి, గొల్లపల్లి తిరుపతి, శనిగరపు శ్యామ్, శనిగరపు ఉదయ్, ఇరిగి సాగర్, రాఘవరాపురం రాము తదితరులుపాల్గొన్నారు.