21-09-2025 12:20:17 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): హైదరాబాద్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీ హెచ్‌ఆర్‌డీ)లో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి శనివారం భేటీ అ య్యారు. రాష్ర్టంలో న్యాయవ్యవస్థకు సం బంధించి మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం అంశాలపై చర్చించారు.
కొత్త జిల్లాల్లో అవసరమైన చోట కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాలని ప్రభు త్వానికి సీజే సూచించారు. ఇందుకు సం బంధించి పలు ప్రతిపాదనలను సీఎం రేవం త్ రెడ్డి దృష్టికి హైకోర్టు సీజే తీసుకొచ్చారు.
దీనిపై సీఎం స్పందిస్తూ ప్రాధాన్యత వారీగా రాష్ర్టంలోని వివిధ జిల్లాలతో పాటు కొత్త జిల్లాలలో కోర్టులకు మౌలిక వసతుల కల్పన, సిబ్బంది నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వీ. శేషాద్రి, లా సెక్రటరీ పాపి రెడ్డి, జస్టిస్ పీ.సామ్ కోశి, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, ఇతర ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.