calender_icon.png 21 September, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక పోరుకు సర్కార్ సిద్ధం!

21-09-2025 12:18:22 AM

  1. పీసీసీ చీఫ్, మంత్రులతో సీఎం సమావేశం
  2. దాదాపు గంటపాటు చర్చ
  3. ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. లోకల్ ఎన్నికల నిర్వహణపై శనివారం అం దుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక సమావేశం నిర్వ హించారు. దాదాపు గంటపాటు సాగిన చర్చలో ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ప్రభుత్వ పరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

సెప్టెంబరు నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీఎంతో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారా వు, సీతక్క తదితరులు పాల్గొన్నారు.