20-10-2025 12:00:00 AM
చొప్పదండి, అక్టోబరు 19 (విజయ క్రాంతి): గంగాధర మండలానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు మధురానగర్ చౌరస్తాలో క్షీరా భిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ మా ట్లాడుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ ప్రాంతంలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసు కువచ్చారని అన్నారు.
గంగాధరలో డిగ్రీ క ళాశాల ఏర్పాటు 20 గ్రామాలకు చెందిన వందలాదిమంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దు బ్బాసి బుచ్చయ్య, సత్తు కనుకయ్య, రోమాల రమేష్, బుర్గు గంగన్న, వొడ్నాల యగ్నేష్, సాగి అజయ్ రావు, కర్ర విద్యా సాగర్ రెడ్డి, గుజ్జుల బాపు రెడ్డి, పడితపల్లి కిషన్, కర్ర బా పు రెడ్డి, వేముల భాస్కర్, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, వేముల అంజి, గరిగంటి కరుణాకర్, దోమకొండ మహేష్, ముచ్చ శంకరయ్య, మంత్రి లత మహేందర్, పడాల రాజన్న, దాతు అంజి, పెంచాల చందు, తదితరులుపాల్గొన్నారు.