calender_icon.png 21 October, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతే దేశ భవిష్యత్తు

20-10-2025 12:00:00 AM

మంథని, అక్టోబర్ 19(విజయ క్రాంతి): యువతే దేశ భవిష్యత్తు అని, చదువుతో పా టు యువత క్రీడలలోనూ ప్రతిభ చూపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు అన్నారు. ఆదివారం మంథని నియో జకవర్గంలోని కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నిర్వహించిన డీపీఎల్-10 క్రికెట్ టోర్నమెంట్లో విజయం సాధించిన విన్నెర్, జీసీఏ టీంకు, రన్నర్ అప్ హరీష్-11 టీం జట్లకు శ్రీను బాబు బహుమతులు అందజేశారు.

అనంతరం క్రీడాకారులను అభినం దించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢ త్వం, పట్టుదల, జట్టు స్పూర్తి వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు, యువత దేశ భవిష్యత్తు అని, వారు చదువుతో పాటు క్రీడలలోనూ ప్రతిభ చూపి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.

క్రీడా మైదా నంలో చూపించే కృషి, క్రమశిక్షణ జీవితం లో కూడా విజయానికి దారి తీస్తుందని పే ర్కొన్నారు, అదే విధంగా యువత సామాజిక సేవ, ప్రజాసేవ రంగాల్లో ముందుకు రా వాలని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ యువతకు ప్రోత్సాహంగా నిలుస్తుందని తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నా యకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మ హిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, క్రీ డాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.