08-03-2025 07:27:28 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి(Indira Mahila Shakti Program) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మహిళా సంఘాల స్టాళ్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీత్తక్క, పొన్నం ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క(Minister Seethakka) మాట్లడుతూ... సమాన పనికి సమాన వేతనం కోసం పోరాడిన రోజే మహిళాదినోత్సవం అన్నారు. ఈ రోజు మన మహిళల రోజు అని, అభద్రతా భావం నుంచి ఆత్మవిశ్వసం దాకా.. వివక్షత నుంచి వికాసం దాకా.. మహిళాలు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నోకార్యక్రమాలు తెచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. మీ సొంత కుటుంబం అని, రాష్ట్ర ప్రభుత్వం 20 రకాల వ్యాపార అవకాశాలు మహిళలకు కల్పిస్తోందని మంత్రి సీతక్క చెప్పారు.