calender_icon.png 22 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెకుముకి టాలెంట్ టెస్ట్‌లో ఇ.బయ్యారం ప్రభుత్వ పాఠశాల ఉత్తమ ప్రతిభ

22-11-2025 02:21:46 AM

 - ప్రైవేట్ స్కూల్స్ నుండి ప్రధమ బహుమతి పొందిన ఎక్సలెంట్ భాష హై స్కూల్ విద్యార్థులు..

- జన విజ్ఞాన వేదిక తెలంగాణ పినపాక మండల కన్వీనర్ బి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహణ

-బహుమతులు ప్రధానం చేసిన పినపాక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే .రమణ.

పినపాక నవంబర్ 21(విజయ క్రాంతి); పినపాక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠ శాలలో శుక్రవారం జనవిజ్ఞాన వేదిక తెలంగాణ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చెకు ముకి టాలెంట్ పోటీలలో ప్రభుత్వ పాఠశాలల నుండి ఇ.బయ్యారం హై స్కూల్ విద్యార్థులు మొదటి బహుమతి సాధించారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రైవేట్ పాఠశా లల నుండి ఎక్సలెంట్ భాషా హై స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి మొద టి బహుమతిని అందుకున్నారు.

ఈ పోటీలలో మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ,ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు తెలుగు ఇంగ్లీష్ మీడియంలలో వేరువే రుగా పరీక్ష నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. మండ ల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలలో  ఇ.బయ్యారం విద్యార్థులు తెలుగు మీడియం నుండి ఎస్.కె ఆయేషా, ఎం శ్రావణి, ఎం స్ఫూర్తి ఇంగ్లీష్ మీడియం నుండి జి పల్లవి, కే దిలీప్ కుమార్, ఎస్ కే రియాజ్, ప్రైవేట్ పాఠశాల నుండి ఎక్స్లెంట్ భాష హై స్కూల్ బయ్యారంకు చెందిన విద్యార్థులు త్రీశాంత్, హేమ శ్రీ, శ్రీలేఖ లు చెకుముకి టాలెంట్ టెస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచి ఔరా అనిపించారు.

పోటీ లో గెలుపొందిన ఎక్సలెంట్ భాష హై స్కూ ల్ కు, ప్రభుత్వ పాఠశాల ఇ.బయ్యారం వి ద్యార్థులకు పినపాక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కే .రమణ చేతుల మీదుగా ప్రధమ బహుమతిని అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల స్థాయిలో ఇటువంటి చెకుముకి టా లెంట్ టెస్టులను నిర్వహించడం వలన విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించవచ్చని సూచించారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ ల వలన విద్యార్థుల మేధాశక్తిని పెంపొందించవచ్చని ఈ టెస్టులు నిర్వహించిన జన విజ్ఞా న వేదిక తెలంగాణ నిర్వహుకులకు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపా ధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.చె కుముకి టాలెంట్ పోటీలలో ప్రథమ బహుమతిని పొంది తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులు యాజమాన్యం గర్వించే విధంగా విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారని ఆయా పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ప్రశంసించారు. చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వాహకులు జన విజ్ఞాన వేదిక తెలంగాణ పినపాక మండల కన్వీనర్ బి రాంబాబు పోటీ పరీక్షలో గెలుపొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులు ఇలాగే చక్కటి ప్రతిభ కనబరుస్తూ భవిష్యత్తులో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.