26-07-2024 11:32:16 AM
హైదరాబాద్: కాళేశ్వరం వద్ద కేటీఆర్ బృందం పర్యటిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం, కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారిని బీఆర్ఎస్ నేతలు దర్శించుకున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహాన్ని కేటీఆర్ బృందం పరిశీలించింది. త్రివేణి సంగమం వద్ద బీఆర్ఎస్ నేతల బృందం గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేశారు. ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం శుక్రవారం పరిశీలించారు. బీఆర్ఎస్ నేతలు గురువారం కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.