calender_icon.png 16 November, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

08-03-2025 10:52:07 AM

హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day 2025) సందర్భంగా ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మహిళలందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సాధికారత, లింగ సమానత్వం సాధించే దిశగా ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలోనూ మహిళలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తోందని గుర్తుచేశారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు. సృష్టికి మూలం, జగతికి ఆధారం, అలుపెరగని శ్రమతత్వంతో పనిచేస్తున్న నారీశక్తికి ముఖ్యమంత్రి ప్రత్యేక వందనాలు తెలియజేశారు.