calender_icon.png 25 November, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొండికుంటలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

25-11-2025 08:07:08 PM

ఎమ్మెల్యే పాయం..

అశ్వాపురం (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నారని మరోసారి స్పష్టమైంది. మంగళవారం మొండికుంట గ్రామ పర్యటనలో భాగంగా, అస్వస్థతకు గురై చికిత్స ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్న మంగళగిరి రమణమ్మకు రూ.25,000 విలువచేసే సీఎంఆర్ఎఫ్ ఆర్థికసహాయం చెక్కును ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. చెక్కు అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో సహాయం అందించడం ప్రభుత్వ ధర్మం అని, ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయనిధి ప్రజలకు అండగా నిలుస్తోందని చెప్పారు.

సామాజిక నిబద్ధతతో ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమం చేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. సహాయం అందుకున్న రమణమ్మ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆర్థికసాయం తమ కుటుంబానికి ఎంతో ఉపశమనంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, కాంగ్రెస్ నాయకులు ఆవుల రవి, తూము రాఘవులు, మచ్చా నరసింహారావు, బచ్చు వెంకటరమణ, బేతం రామకృష్ణ, సింగం శ్రీధర్, ఆటో నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.