calender_icon.png 25 November, 2025 | 9:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాసన పరిశోధకులకు తెలంగాణ స్వర్గధామం

25-11-2025 08:04:14 PM

ప్రముఖ శాసన పరిశోధకులు డాక్టర్ డి సూర్యకుమార్..

నకిరేకల్ (విజయక్రాంతి): శాసన చరిత్రలో శాసన పరిశోధకులకు తెలంగాణ స్వర్గధామం అని తెలంగాణ తొలి వైతాళికుడు కొమరాజు లక్ష్మణ్ రావు పంతులు నొక్కి వక్కానించారని ప్రముఖ శాసన పరిశోధకులు డాక్టర్ డి. సూర్య కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ప్రపంచ హెరిటేజ్ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో తెలంగాణ శాసనాలు - వెలుగుచూడని ఆసక్తికర విషయాలు అంశంపై ఆయన ప్రసంగించారు.

అశోక చక్రవర్తి దేవానాం ప్రియ బిరుదు తెలంగాణ రాష్ట్రంలోని మంజీర నది పరివాహక ప్రాంతంలో మట్టి పెంకుపై లభించిందని పేర్కొన్నారు. బౌద్ధంలో స్తూపం అన్న పదం రామన్నపేట మండలం తుమ్మల గూడెం ప్రాంతంలో తామ్ర శాసనంలో లభించిందని వివరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలోనీ శాసనాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మ్యూజియం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ డి. నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ మల్లు నాయక్, సీనియర్ జర్నలిస్టు టి. శివాజీ, ఇంటాక్ హైదరాబాద్ అధ్యక్షురాలు అనురాధ రెడ్డి, పున్న కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.