calender_icon.png 20 September, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్

20-09-2025 12:00:00 AM

కాట శ్రీనివాస్ గౌడ్ 11 మందికి రూ.5,79,500 చెక్కులు పంపిణీ 

అమీన్‌పూర్, సెప్టెంబర్ 19 : పేదల ఆరోగ్య సమస్యల పరిష్కారంలో సీఎం సహాయ నిధి నిజమైన సంజీవనిగా మారిందని పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో 11 మంది లబ్ధిదారులకు రూ.5,79,500 సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్  మాట్లాడుతూ  ప్రజల ఆరోగ్యం కాపాడటం, పేదలకు ఆర్థిక భరోసా కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చంద్రారెడ్డి, వడ్డే కృష్ణ, సుధాకర్ గౌడ్, సుధాకర్ యాదవ్, నర్సింగరావు, గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుపాల్గొన్నారు.