19-09-2025 10:44:14 PM
ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు
మహబూబాబాద్,(విజయక్రాంతి): లక్ష్యంతో చదివి, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చని ఎమ్మెల్సీ తక్కళ్ళపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ప్రిన్సిపల్ పొక్కుల సదానందం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ రవీందర్రావు మాట్లాడుతూ 302 మంది విద్యార్థులతో జిల్లాలోనే అడ్మిషన్లలో బాలికల జూనియర్ కళాశాల ముందుండడం విశేషం అన్నారు. అడ్మిషన్ల లో అగ్రభాగాలను నిలిచిన కళాశాల విద్యార్థులు అదే రీతిలో చక్కగా చదువుకొని అత్యున్నత మార్కులతో కావాలని ఆకాంక్షించారు. చదువుకు పేద ధనిక భేదం లేదని , చదువుతూనే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు.