01-12-2025 12:19:09 AM
అలంపూర్, నవంబర్ 30: నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్ పథకం వరమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం అయిజ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన కురువ వెంకటస్వామికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి నుంచి రూ.4 లక్షల ఎల్‌ఓసి మంజూరు కాగా బాధ్యత కుటుంబ సభ్యులకు అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు తిమ్మాపురం నారాయణ, తదితరులు పాల్గొన్నారు.