calender_icon.png 1 December, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలి

01-12-2025 12:19:31 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అల వర్చుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివా రం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని అమ్మవారి దేవాలయం వద్ద  మదర్ ల్యాండ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఓల్ ఏజ్ హోమ్ ఫర్ ఆర్పన్స్  చైర్మన్ ఆలీ ఆధ్వర్యంలో  పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు.

ప్రతి నెల చివరి రోజు అన్నదానం కార్యక్ర మం చేపట్టి పేదలకు అండగా నిలుస్తున్న సొసైటీ చైర్మన్ ఆలీని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఆలీ ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ బీఆర్‌ఎస్ మీడియా ఇన్ఛార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, సొసైటీ ప్రతినిధులు వై.  మల్లేష్, వెంకటేష్ కే. శ్రీనివాస్, బాలయ్య యాదవ్, ఎస్.కె రషీద్, సంతు తదితరులు పాల్గొన్నారు.