01-12-2025 12:18:22 AM
మేడిపల్లి నవంబర్ 30 (విజయక్రాంతి): కోడిపందాలు ఆడుతున్న వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెంగిచెర్ల మేకల మండి దగ్గర లో గల నిర్మానుషప్రాంతంలో కొందరు వ్యక్తులు ఆదివారం మధ్యాహ్నం కోడి పందా లు ఆడుతున్నరని విశ్వసనీయ సమాచారం మేరకు మేడిపల్లి సీఐ ఆర్ గోవిందరెడ్డి ఆదేశానుసారం ఎస్సై శీను, హెడ్ కానిస్టేబుల్ రాము, హెచ్‌జీ శీను, సంఘటన స్థలానికి చేరుకొని, కోడి పందాలు నిర్వహిస్తున్న 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించామని,నేరస్తుల నుంచి రెండు కోళ్లు, రెండు కత్తులు, మొబైల్ ఫోన్లు, 18 వేల నగదును సీజ్ చేసి, కేసు నమోదు చేసుకొని, విచారణ ప్రారంభించామని మేడిపల్లి పోలీసులు వెల్లడించారు.