22-09-2025 12:49:32 AM
మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో మూడు చింతలపల్లి గ్రామానికి చెందిన గంగాపురం విద్య చికిత్స కోసం 2 లక్షల రూపాయల ఎల్‌ఓసిని బంధువులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యం పాలైన వారి వైద్య ఖర్చులకు సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుంద న్నారు. బాధితులకు ఇదొక వరం లాంటిది అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అనేకమంది సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో షామీర్పేట్ మండల బిఆర్‌ఎస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.